
తెలంగాణ అసెంబ్లీలో నిరసనకారులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు.
మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
సభలో జరిగిన ఘటనకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.