
ఇటీవల జరిగిన సైబర్ ఘటనలో డార్క్ వెబ్‌లో 3,897 మంది ఖాతాదారుల వివరాలు బయటపడినప్పటికీ, వారి ఖాతాల్లోని నగదు సురక్షితంగా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది.
ప్రభావితమైన ఖాతాదారులకు ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించామని బ్యాంకు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని ఎస్‌బీఐ హెచ్చరించింది.