భారతదేశం రష్యా నుంచి చమురును తన సొంత ఇంధన భద్రత, ప్రజల సంక్షేమం కోసమే కొనుగోలు చేస్తోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు.
పశ్చిమ దేశాల ఆంక్షలు, టారిఫ్ల ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
యుద్ధాన్ని చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించగలమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉక్రెయిన్ పర్యటనలో స్పష్టం చేశారు.