
ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడం మరియు 87 ఏళ్ల మహిళను బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆగ్రహం వ్యక్ చేస్తూ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్తో పాటు బార్సిలోనా, వలెంషియా నగరాల్లో శనివారం వేలాది మంది నిరసనలు తెలిపారు.
మాడ్రిడ్లో సుమారు 70 వేల మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి రాగా, వలెంషియాలో ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు మరియు లాఠీచార్జి ఉపయోగించాల్సి వచ్చింది.
ఇంటి అద్దెల నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో, సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని లేనిపட்சంలో సకల జనుల సమ్మెకు దిగుతామని ఆందోళనకారులు హెచ్చరించారు.