
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ సమయంలో భక్తులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై తితిదే స్పందించింది.
టికెట్ల బుకింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉండటం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని తితిదే శనివారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
భక్తులు అభ్యర్థించే సమయంలో ఉన్న భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ వివరణను వెల్లడించడం జరిగింది.