
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది.
ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 21.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖలో 35.40 శాతం, చిత్తూరులో 32.97 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు అధికారిక సమాచారం.