
భారత బాక్సర్ అంకుష్ పంఘల్ ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి దేశానికి తొలి బాక్సింగ్ పతకాన్ని ఖాయం చేశాడు.
ఆదివారం జరిగిన పురుషుల 80 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తజకిస్థాన్‌కు చెందిన నెక్రుజ్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు.
గత నెలలో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అంకుష్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.