
సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు హైదరాబాద్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి వచ్చి ఆయనను కలిశారు.
నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కేటీఆర్, శైలిమ దంపతులకు వారు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.