
జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల వసతి ఏర్పాట్లలో భారత బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు క్రూయిజ్ షిప్‌లో ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది.
భారత ఒలింపిక్ సంఘం జోక్యంతో అర్ధరాత్రి దాటిన తర్వాతే వారికి వేర్వేరు గదులను కేటాయించారు.