
మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో నలుగురు వ్యక్తుల మరణానికి కారణమైన పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు.
కొన్ని రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత అధికారులు ఈ నరమాంస భక్షక పులిని పట్టుకోవడంలో విజయం సాధించారు.
స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఈ పులిని బంధించడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.