
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ సీజే, రిటైర్డ్ డీజీపీలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
నిరసనల సమయంలో నమోదైన ఎఫ్ఐఆర్‌ల వివరాలను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాకు అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం, నేర చరిత్ర లేని విద్యార్థులపై కేసుల రద్దును పరిశీలిస్తామని తెలిపింది.
ఈ కమిటీ పార్లమెంట్ మార్చ్ నాటి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, బాధితుల వాదనలను విన్న తర్వాత తన సిఫార్సులను సమర్పిస్తుందని కోర్టు పేర్కొంది.