
వైసీపీ హయాంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో విమర్శించారు.
గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేసిందని, తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి బీ-ఫారం పొందిన అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు, పోలవరం పూర్తయితే రాయలసీమకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.