
ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న హాకీ ప్రపంచకప్లో భారత క్రీడాకారులు నీలి రంగుకు బదులుగా కాషాయ రంగు జెర్సీలను ధరించాలని హాకీ ఇండియా నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తనకు సమాచారం లేదని, ఎగ్జిక్యూటివ్ బోర్డు పరిశీలనకు కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు.
కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాత్రం జెర్సీ మార్పుపై అందరికీ అవగాహన ఉందని, దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సరికాదని స్పష్టం చేశారు.