
భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ) ప్రకటించింది.
ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.
టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయంలో భాగంగా గాలేలో గేట్ నెం. 4 ద్వారా, కొలంబోలో గేట్లు 3, 4, 5, 7 ద్వారా ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నారు.