పెట్టిన పెట్టుబడి ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా అంచనా వేయడానికి 'రూల్ ఆఫ్ 72' ఉపయోగపడుతుంది.
72ని వార్షిక అంచనా రాబడి శాతంతో భాగిస్తే డబ్బు డబుల్ కావడానికి పట్టే సమయం తెలుస్తుంది.
ఉదాహరణకు 9 శాతం వార్షిక వడ్డీ వస్తే దాదాపు 8 సంవత్సరాలలో పెట్టుబడి రెట్టింపు అవుతుంది.