బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక అణచివేత ఫలించకపోవడంతో, పాకిస్థాన్ ప్రభుత్వం వేర్పాటువాదులతో శాంతి చర్చలకు సిద్ధమైంది.
ప్రావిన్స్‌లో తీవ్రమవుతున్న హింస, ఆర్థిక అసంతృప్తిని బలంతో అణచివేయలేమని షెహబాజ్ షరీఫ్ సర్కార్ గ్రహించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్‌లో భౌగోళికంగా అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్‌లో చర్చల మార్గాన్ని ఎంచుకోవడం కీలక విధాన మార్పుగా కనిపిస్తోంది.