
2027 జనవరి 21 నుంచి మార్చి 3 వరకు జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది.
భారత పిచ్‌లపై అనుభవం కోసం ఆస్ట్రేలియా 'ఎ' జట్టును భారత్‌కు పంపాలని ఆసీస్ సెలెక్టర్లు నిర్ణయించారు.
ప్రస్తుత టెస్టు జట్టు సగటు వయసు 33 ఏళ్లకు చేరడంతో, కూపర్ కానలీ వంటి యువ ప్రతిభావంతులకు ప్రాధాన్యత ఇస్తూ జట్టును పునర్నిర్మిస్తున్నారు.