
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణా సంఘం సిఫారసు చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం వారిపై కఠిన నిర్ణయానికి సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోగానే కొండా సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాలని హైకమాండ్ యోచిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లగా, సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించనున్నారు.