
పాకిస్థాన్ తన దేశంలోని గాడిదల మాంసం మరియు చర్మాన్ని మిత్ర దేశమైన చైనాకు ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తోంది.
బలూచిస్థాన్ సమీపంలోని గ్వాదర్‌లో పాకిస్థాన్ భారీ స్లాటర్ హౌజ్‌ను ఏర్పాటు చేసి రోజూ వందలాది గాడిదలను వధిస్తుండగా, దీనిని ఒక చైనా కంపెనీ నిర్వహిస్తోంది.
ఈ గాడిదల వ్యాపారం ద్వారా త్వరలో నెలకు రూ.47 కోట్లు, మరో రెండేళ్లలో నెలకు రూ.67 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుతుందని అంచనా వేశారు.