
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గడిచిన 8 నెలల వ్యవధిలో 19 లింగమార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ సర్జరీలన్నీ పేషంట్లకు పైసా ఖర్చు లేకుండా సీఎంఆర్ఎఫ్ మరియు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా అందించారు.
ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి నేతృత్వంలో ఈ వైద్య సేవలు అంతర్జాతీయ నియమావళి ప్రకారం సాగాయి.