
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీని ఏర్పాటు చేస్తూ, రూ.100 కోట్ల పైబడిన సినిమాలకు తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది.
ప్రతి థియేటర్‌లో 25 శాతం నాన్-ప్రీమియం సీట్లు ఉండాలని, కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతినిస్తూ, చిన్న సినిమాలకు ప్రతిరోజూ ఒక షో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది.