
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణమైన క్రివీ రిహ్‌లోని షాపింగ్ మాల్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో శనివారం నాటికి 16 మంది మరణించారు.
ఈ వరుస దాడుల్లో 130 మందికి పైగా గాయపడగా, 9 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి కీవ్‌లోని రైల్వే మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల్లో మరో ముగ్గురు మృతి చెందగా, రష్యాలోని క్రాస్నోడర్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడిలో ఇద్దరు మరణించారు.