
కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కోసం ఆ దేశ ప్రభుత్వం కొత్త ఆర్థిక నిబంధనలను అమలులోకి తెచ్చింది.
సెప్టెంబర్ 1 నుంచి కెనడా వెళ్లే విద్యార్థులు తమ వద్ద ఉన్న నిధులను నిరూపించుకోవాల్సిన అవసరం పెరిగింది.
ఈ కొత్త నిబంధనలు కెనడాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నాయి.