
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పంజాబ్ సింగర్ దలేర్ మెహందీ ప్రదర్శనపై మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం సేవించి దుర్గామాత కార్యక్రంలో పాటలు పాడుతూ కళాకారులు కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.