
ఇజ్రాయెల్‌లో 2019 నుంచి ఆగస్టు 2026 వరకు ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 4.49 కోట్లు ఖర్చయినట్లు వెల్లడైంది.
ఈ మొత్తం ఖర్చులో దాదాపు 90 శాతం కేవలం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహులకే ఖర్చయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది.
హమాస్‌తో తీవ్ర యుద్ధం జరుగుతున్న కాలంలోనూ విదేశీ పర్యటనల సమయంలో భారీగా నిధులు వెచ్చించడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.