
తెలంగాణలో సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
భారత రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, అసైన్డ్ భూములు, వక్ఫ్ ఆస్తులు వంటి వాటిని నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేస్తోంది.
పాత రికార్డులు, ప్రస్తుత భూమి స్థితి మధ్య ఉన్న వ్యత్యాసాల వల్ల చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులు కూడా ఈ జాబితాలో చేరి యజమానులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.