
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్ (SIR)-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై కీలక సమీక్ష నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అనర్హులను తొలగించాలని డీఈఓలు, ఈఆర్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఈవో అధికారులను ఆదేశించారు.
ఫారం 6, 6A, 7, 8 ద్వారా వచ్చే క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని మరియు నో-మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.