
సీఎస్‌కే ఫ్రాంచైజీలో ధోనీ 25 శాతం వాటా అడిగారని, చివరకు 5.5 శాతం ఇచ్చారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.
సీఎస్‌కే విలువ సుమారు 1.8 బిలియన్ డాలర్లు అని, అందులో 25 శాతం వాటా అంటే 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని ఆయన వివరించారు.
ఎవరూ అంత భారీ మొత్తాన్ని ఉచితంగా ఇవ్వరని, ఇదంతా ప్లాన్ ప్రకారం సృష్టించిన తప్పుడు కథనమని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.