
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కింది.
పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి మల్టీ డే మ్యాచ్‌లు, అక్టోబర్ 6 నుంచి మూడు వన్డేలు జరగనున్నాయని బోర్డు వెల్లడించింది.
మల్టీ డే మ్యాచ్‌లకు దేవ్‌దత్ పడిక్కల్ కెప్టెన్‌గా, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ సారథిగా వ్యవహరించనుండగా, తెలుగు ఆటగాడు షేక్ రషీద్‌కు జట్టులో స్థానం లభించింది.