
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో తలదాచుకున్నాడన్న పాకిస్థాన్ వాదనలను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
మసూద్ అజార్ ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో లేడని ఆ దేశ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి బుధవారం స్పష్టం చేశారు.
తమ గడ్డను ఏ దేశంపై ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవడానికి అనుమతించబోమని కాబూల్ మరోసారి తేల్చిచెప్పింది.