
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు 7 లేదా 8 నెలల వయసు నుంచి ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ పరిచయం చేయాలని పీడియాట్రిషియన్ డాక్టర్ సందీప్ గుప్తా సూచించారు.
బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ను దోరగా వేయించి మెత్తటి పొడి చేసుకుని పాలలో లేదా పండ్ల గుజ్జులో కలిపి ఇవ్వవచ్చని తెలిపారు.