హ్యుందాయ్ కంపెనీ కొత్తగా రూపొందించిన బేయాన్ ఎస్‌యూవీ కారును ఖమ్మం మార్కెట్‌లో జిల్లా రవాణా శాఖాధికారి డి.జగదీష్ శనివారం ఆవిష్కరించారు.
ఈ కారులో జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, లెవల్–2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయని సీఈఓ శయన్‌కృష్ణ తెలిపారు.
ఈ కారు ప్రారంభ ధర రూ.9,99,900 నుండి మొదలవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.