
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
మజ్జి శ్రీను పార్టీ వీడిన పరిణామాల నేపథ్యంలో చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పార్టీని వీడుతున్న వారి వివరాలపై మాజీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
బడ్డుకొండ అప్పలనాయుడు సీనియర్ నేత బొత్సా సత్యనారాయణకు సమీప బంధువు కాగా, సమావేశంలో ఆయన కుటుంబ రాజకీయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.