
అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆర్థిక స్థితిపై కఠిన నిబంధనలను సెప్టెంబర్ 18 నుంచి అమలు చేయనున్నట్లు యూఎస్సీఐఎస్ ప్రకటించింది.
ప్రభుత్వ గృహ వసతి, ఫుడ్ స్టాంప్స్ వంటి సంక్షేమ పథకాలు పొందిన వారిని 'పబ్లిక్ ఛార్జ్'గా పరిగణించి దరఖాస్తులను పరిశీలిస్తారు.
జులై 16న ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే ఫారం I-485 దరఖాస్తులకు వర్తిస్తాయి.