
మెగా డీఎస్సీ-2025 వ్యవహారంపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వ్యక్తిగత దూషణలు జరగడంతో మండలి వాయిదా పడింది.
డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పించలేదని బొత్సను 'దద్దమ్మ' అని అచ్చెన్నాయుడు అనగా, దానికి ప్రతిగా బొత్స 'ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు' అని వ్యాఖ్యానించారు.
వైసీపీ సభ్యుల నిరసనలు, పోడియం వద్ద నినాదాలతో సభ ఆర్డర్లోకి రాకపోవడంతో చైర్మన్ మోషేన్ రాజు మండలిని మంగళవారానికి వాయిదా వేశారు.