
ఆసియా పారా గేమ్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఢిల్లీలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఇటీవల ఆయనపై సస్పెన్షన్ విధించారని, దీనివల్ల ఆసియా పారా గేమ్స్‌కు దూరమవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని భావిస్తున్నారు.
పోలియోను జయించి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెచ్చిన ఛాంపియన్ అథ్లెట్ మృతి పట్ల క్రీడా లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.