
చమురు కేంద్రాలపై దాడే లక్ష్యంగా రష్యాలోని పలు ప్రాంతాలు, క్రిమియా, అజోవ్ సముద్రం ఏరియాలపై ఉక్రెయిన్ సోమవారం రాత్రి డ్రోన్లతో దాడి చేసింది.
ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 900 డ్రోన్లను తమ దళాలు కూల్చివేశాయని రష్యా వెల్లడించింది.
ఈ దాడిలో మాస్కో రీజియన్లోని ఇంధన డిపో మంటల్లో చిక్కుకుందని, ఇద్దరు మరణించారని సమాచారం.