
సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేసింది.
2025లో సౌదీ అరేబియా నుంచి 27,692 మందితో సహా మొత్తం 38,616 మంది పాకిస్థానీయులు వివిధ కారణాలతో డిపోర్ట్ అయ్యారు.
హజ్, ఉమ్రా యాత్రికులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, విమానాశ్రయాల్లోనే తనిఖీలు పెంచామని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.