జీవితాంతం స్థిరంగా ధనవంతులుగా కొనసాగుతున్న వ్యక్తులకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని ఒక నూతన అధ్యయనం తెలిపింది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ సర్వే కోసం 45 సంవత్సరాలు పైబడిన 65,364 మంది భారతీయుల ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించారు.
నిరంతరం ధనిక వర్గాలలో ఉన్నవారికి కంజెస్టెవ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు సాధారణ స్థాయి కంటే 1.8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు హెచ్చరించారు.