
సింగరేణి కాలరీస్ కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో 1.23 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను సంస్థ సీఎండీ డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి ప్రారంభించారు.
పర్యావరణహిత చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ ఇప్పటివరకు 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది.
భవిష్యత్తులో థర్మల్ విద్యుత్‌తో పాటు సోలార్ మరియు ఫ్లోటింగ్ సోలార్ రంగాల్లో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.