
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రంలో మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన మూడు విభిన్న లుక్స్‌ను ఫైనల్ కట్లో తొలగించడంపై కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంసుద్దీన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన ఆయన, ట్రైలర్లో కేవలం రెండు సెకన్లు మాత్రమే కనిపించానని, ఒకవేళ జైలర్ 3 వస్తే తాను అందులో భాగం కానని స్పష్టం చేశారు.
సినిమా పరిశ్రమలో కోట్ల వసూళ్లు, స్టార్డమ్ కోసం తాను పనిచేయడం లేదని, కేవలం కళను ప్రేమించేవారికోసమే పని చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.