
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిపిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన 28 ఏళ్ల వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు.
సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు.
ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.