
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ నెల 11న జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
హత్యకు పాల్పడింది సదరు పాఠశాలకు చెందిన పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ దారుణ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.