
స్టాక్ ఎక్సే్చంజీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన 15 నిమిషాల క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్)లో జరిగిన హెచ్చుతగ్గులపై సెబీ దర్యాప్తు చేపట్టింది.
ఆగస్టు 3న నిఫ్టీ చివరి నిమిషాల్లో 201 పాయింట్లు, ఆగస్టు 4న 152 పాయింట్లు పెరగడంపై సెబీ నిశితంగా పరిశీలిస్తోంది.
మార్కెట్ ముగింపు ధరలను ప్రభావితం చేసేందుకు ఏవైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో ట్రేడింగ్ డేటాను విశ్లేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.