
సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్నప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు.
అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్‌ను జట్టులోకి తిరిగి తీసుకున్నారు.