
ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరాలు పెరిగాయి.
కార్లు, ఎస్యూవీలు, వ్యాన్లు కలిపి మొత్తం 13,60,687 ప్రయాణికుల వాహనాలు డీలర్లకు చేరినట్లు సియామ్ వెల్లడించింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కార్ల సరఫరాలు 30.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.