
తన పేరు, ఇమేజ్ దుర్వినియోగం కాకుండా రక్షణ కోరుతూ జాన్వీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఫ్యాన్ పేజీలను పూర్తిగా నిషేధించలేమని, అభిమానులు నటీనటులను అభినందించడానికి అవి అవసరమని జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ వ్యాఖ్యానించారు.
అయితే, ఏఐ ద్వారా రూపొందించిన అశ్లీల కంటెంట్, నకిలీ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.