
కేరళలో సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'క్లిక్' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా, 'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మలయాళ నటుడు మమ్ముట్టిని నియమించారు.
రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి రమేశ్ చెన్నితల ఈ నియామకాన్ని ప్రకటించారు.