
నల్ల క్యారెట్లలో ఉండే ఆంతోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
ఇందులోని విటమిన్-ఎ మరియు బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, అధిక ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.