
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
బస్సు టైర్ పంచర్ కావడంతో రోడ్డుపై నిలిపి ఉంచగా, బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలపైకి కంటైనర్ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.